10,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

10,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న స్మార్ట్‌ఫోన్

July 30, 2020

Gionee launching Android phone with 10,000 mAh battery

స్మార్ట్‌ఫోన్ సాంకేతికత రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ ఫోన్ తయారుదారులు కొత్త కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఎక్కువ కెమెరాలున్న ఫోన్లు, డిస్ప్లే పెద్దగా ఉన్న ఫోన్ లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జియోనీ కంపెనీ ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది. 

ఇంత భారీ కెపాసిటీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రావడమంటే విశేషం. ఈ ఫోన్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనీసం మూడు నాలుగు రోజులు ఛార్జింగ్ అవసరంలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. జియోనీ మారథాన్ సిరీస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో 2015లో జియోనీ మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్ 6,020ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది. ఆ తర్వాత జియోనీ మారథాన్ ఎం2017 స్మార్ట్‌ఫోన్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది. ఇప్పుడు ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో కొత్త మోడల్ వస్తుంది. మిగతా కంపెనీలు కెమెరా, డిస్ప్లేలను పెంచుతుంటే జియోనీ మాత్రం బ్యాటరీ కెపాసిటీని పెంచుకుంటూ పోతుంది.