మానవుల పైశాచికం.. ఆవును పట్టుకెళ్లి సింహంతో చంపించి..  - MicTv.in - Telugu News
mictv telugu

మానవుల పైశాచికం.. ఆవును పట్టుకెళ్లి సింహంతో చంపించి.. 

October 16, 2020

Gir forest people take video of lion and cow

చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చాక చాలా మంచితోపాటు బోలెడు నేరాలు కూడా సాగుతున్నాయి. కొందరు ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు సెల్ఫీల మోజుతో పట్టుతప్పి చచ్చిపోతున్నారు. మరికొందరు పైశాచికానందం కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. ఆవును సింహం చంపితే ఎలా ఉంటుందో చూసి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోడానికి కొందరు దశ్చర్యకు పాల్పడ్డాడు. 

ఓ ఆవును పట్టుకొచ్చి దాన్ని సింహం తిరిగే ప్రాంతంలో ఉంచారు. సింహం దాన్ని పసిగట్టి పరుగున వచ్చి మెడకాయ పట్టుకుంది. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న మానవులు టకటకా వీడియోలు తీసుకున్నారు. గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై అటవీ అధికారులు మండిపడుతున్నారు. సింహం ఆవుపై కాకుండా మనుషులపై వచ్చే పరిస్థితి ఏంటని, ఇకపై ఇలాంటి దుస్సాహసాలకు పాల్పొద్దని హెచ్చరిస్తున్నారు. గిర్ అటవీ ప్రాంతాల ప్రజలు సింహాల వీడియోల కోసం వాటికి కోళ్లను, కుక్కలను ఎరగా వేస్తుండడం అలవాటుగా మారిపోయింది.