మేకలు, బర్రెలు, గొర్రెలు, గాడిదలు, పందులు, ఏనుగులు. మరెన్నో జంతువులకు లేని కష్టాలు జిరాఫీకి ఉన్నాయి. దాని కాళ్లు, మెడ పొడవే దానికి పెద్ద సమస్య. చెట్లపై ఉన్న ఆకులను ఎంచక్కా మెడ చాచి, నాలిక జాపి గుటకాయ స్వాహా చేసి జిరాఫీ నేలపై ఉన్న గడ్డిని తినాలంటే మాత్రం చేతులు ఎత్తేసింది. కాళ్లు పొడవుగా ఉండడం వల్ల అది మిగతా జంతువుల్లాగా సజావుగా నిలబడి తినలేదు. అందుకే కాళ్లను కాస్త అటూ ఇటూ విటూ విసిరేసి తీసి మూతిని గడ్డిపై పెడుతుంది.
ఓ జిరాఫీ అలా గడ్డి కరుస్తుండగా తీసిన వీడియో ఇది. దీని కష్టం చూసిన నెటిజన్లు ‘అయ్యో పాపం.. ’ అంటున్నారు. మరికొందరు జూ సిబ్బంది ఏమైయ్యరని ప్రశ్నిస్తున్నారు. ‘దేవుడు వీటికి ఏనుగుల్లాగే తొండం ఇచ్చి ఉంటే సమస్య తప్పేది?’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాఫీలకు జూలలో అవి వినడానికి వీలుగా గడ్డిని ఎత్తైన బల్లలపై ఉంచుతుంటారు. జిరాఫీలు నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతుంటాయి. అడవుల్లో బతికేవి చెరువుల వద్ద కాళ్లనూ అటూ ఇటూ విసిరేసి వంగి దాహం తీర్చుకుంటాయి. ఆ సమయంలో నీటిలోని మొసలిగాని, పక్కనుంచి సింహం, పులులుగాని వస్తే చచ్చేంత చావే.
I’ve never wondered how a Giraffe eats grass before, but this is majestic! pic.twitter.com/9pjbTugdKm
— Daniel Holland (@DannyDutch) October 12, 2020