కేటీఆర్ సార్ మా ఊరికి పంపండి..యువతి ట్వీట్‌కు స్పందన ఇదీ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ సార్ మా ఊరికి పంపండి..యువతి ట్వీట్‌కు స్పందన ఇదీ

March 25, 2020

Girl

దేశంలో లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది ఏర్పడింది. అన్ని రకాల రవాణా సౌకర్యాలు మూసుకుపోవడంతో సొంత ఊళ్లకు వెళ్లేవారికి కష్టం వచ్చిపడింది. తెలుగు  రాష్ట్రాల్లో ప్రజలు తరుచూ రాకపోకలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఒకటి, రెండు రోజులు పనుల కోసం, ఉద్యోగాన్వేషణ కోసం వచ్చే వారు ఎక్కువగానే ఉంటారు. అలాంటి వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. 

సుహాసిని అనే యువతి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.‘కేటీఆర్ సార్ నా పేరు సుహాసిని. నేను ఉద్యోగం చూసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎటూ వెళ్ళలేక ఇక్కడే ఇరుక్కుపోయాను. రెండు రోజుల నుంచి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్నా.హైదరాబాద్‌లో ఉండేందుకు నాకు ఎలాంటి ఆప్షన్ లేదు. నేను తిరిగి మా ఊరి వెళ్ళడానికి సాయం చేయండి’ అంటూ కోరింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి మీరు బాధపడకండి సిస్టర్ మా వాళ్లు వచ్చి మీకు సాయం చేస్తారంటూ పేర్కొన్నారు. దీంతో ఆ యువతి సొంత ఊరికి తిరిగి వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది.