సినిమాల్లో చూపించినట్టు నిజ జీవితంలోనూ కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాంటి ఓ సంఘటన తనకు ఎదురైందని ఓ యువతి వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. యువతి మాటల్లోనే ‘నేను కొద్ది రోజులుగా ఓ వ్యక్తిని ప్రేమించాను. నాకు కావాల్సిన లక్షణాలు అన్నీ అతడిలో ఉండడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. దాంతో మా ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా చేశారు. ఇక పెళ్లే మిగిలింది అనుకుంటుండగా, చీరల సెలెక్షన్స్, ఆహ్వన పత్రిక, నేను వేసుకునే దుస్తులు, విందులో ఏ వంటకాలు ఉండాలి? వంటి ప్రతీదీ నా అత్తే ఆజమాయిషీ చేయడం ప్రారంభించింది.
పెళ్లిలో ప్రతీ క్రియా ఆమె ఆదేశానుసారం జరగాల్సిందే. దాంతో నేను భయపడిపోయి ఈ విషయాన్ని నా కాబోయే భర్తకు చెప్పాను. కానీ, అతడు సర్ధుకుపోవాలని చెప్పడంతో నేను నా ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నట్టు అనిపించింది. తర్వాత ఇలాగైతే నేను మీ అమ్మగారు ఉన్న ఇంట్లో ఉండను.. మనమిద్దరం కలిసి పెళ్లైన తర్వాత సెపరేటుగా ఓ ఇల్లు కొనుక్కొని అందులో ఉందామని చెప్పా. దాని వల్ల నాకు కొంత ప్రైవసీ ఉంటుందని నచ్చజెప్పాలని చూశా. కానీ, అతడు ఒప్పుకోలేదు. మా అమ్మ ఉంటున్న ఇల్లే నాకు శాశ్వతం అని తెగేసి చెప్పేశాడు. దాంతో పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతకుముందు జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు నా వయస్సు 30 ఏళ్లు. అయినా ఒంటరిగానే ఉంటున్నా. నన్నర్ధం చేసుకునే మంచి వ్యక్తి కోసం వేచి చూస్తున్నా’నని సదరు యువతి పేర్కొంది. కాగా, ఈ పోస్ట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నువ్వు బరితెగించావు. అమ్మనీ, కొడుకునీ వేరు చేయాలని చూస్తున్నావు అంటూ విమర్శిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టప్రకారం జీవించే హక్కును ఎప్పుడూ వదులుకోకు అంటూ సలహా ఇస్తున్నారు. మీరైతే ఏం చెప్తారు. కామెంట్ చేయండి.