girl chopped into pieces by lover in Bangladesh
mictv telugu

అక్కడ ఢిల్లీ మర్డర్ సీన్ రిపీట్

November 18, 2022

girl chopped into pieces by lover in Bangladesh

అచ్చం ఢిల్లీ తరహా ఘటన. ఒక వర్గం అమ్మాయిని మరో వర్గం అబ్బాయి చంపేశాడు. యువతి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఇంటికి పిలిచి మరీ దారుణానికి తెగబడ్డాడు.నమ్మి వచ్చిన అమ్మాయిని నరికేశాడు.ఇది జరిగింది బంగ్లాదేశ్‌లోనైనా..అచ్చం ఢిల్లీ తరహా ఘటనలాగే ఉంది. ఈ ఘటనలలో అసలేం జరిగింది. వీహెచ్‌పీ ఆరోపిస్తున్నట్టు లవ్ జిహాద్ కోణం ఉందా?ఓ వర్గం అమ్మాయిల్ని మరో వర్గం అబ్బాయిలు టార్గెట్ చేశారా?లేదా యాదృచ్ఛికంగా ప్రేమలు పుడుతున్నాయా?

ఢిల్లీ సీన్ రిపీట్

కవితా రాణి , అబు బకర్‌లు ప్రేమించుకున్నారు.కొన్నిరోజులుగా ఇద్దరూ కలుస్తున్నారు.ఓ రోజు కవితారాణిని అబు బకర్ ఇంటికి పిలిచాడు. మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ముదరడంతో అబు బకర్ చెలరేగిపోయాడు. ఆవేశంలో కవితారాణిని అతను చంపేశాడు. ఆతర్వాత శ్రద్దా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ చేసినట్టే చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేశాడు.తల,మొండెం, చేతులు వేరు చేసి పాలిథిన్ కవర్‌లో చుట్టాడు.

ఎలా తెలిసిందంటే…

ఆరోజు నవంబర్ 6. అబు బకర్ డ్యూటీకి రాలేదు. ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ ఓనర్ ఫోన్ చేస్తే తీయలేదు. దీంతో ఆ ఓనర్ ఓ వ్యక్తిని అబు ఇంటికి పంపాడు. అతను వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసింది.దీంతో ఓనర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. వెంటనే వచ్చిన పోలీసులు అబు ఇంటి తాళం పగులగొట్టారు. లోపలకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. బాక్స్ లో తలలేని బాడీ ఉంది. తల వేరే ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంది. చేతులు మిస్సయ్యాయి. స్పాట్‌ని పరిశీలించిన పోలీసులు మృతురాలిని కవితారాణిగా గుర్తించారు. కవిత కలిపాద్ బచర్ కూతురు.

మరో అమ్మాయితో సహజీవనం

నవంబర్ 7న అబు బకర్‌ని బంగ్లాదేశ్ ర్యాపిడ్ పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు సప్న అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. అబు బకర్ సప్నతో కలిసి గోబర్చాక స్వ్కేర్ ఏరియాలో ఉంటున్నాడు. నాలుగేళ్లుగా వీళ్ల మధ్య సహజీవనం కొనసాగుతోంది. అబు,సప్న లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు.

కవిత ఎలా పరిచయం..?

కవిత ఈమధ్యనే అతనికి పరిచయం అయింది. ఈ స్నేహం ప్రేమగా మారింది.
నవంబర్ 5న సప్న ఇంటినుంచి పనిమీద బయటకువెళ్లింది. ఇదే సమయంలో అబు కవితకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వచ్చాక ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఆతర్వాత గొడవ జరిగింది. ఈ క్రమంలో కవితను అబు బకర్ చంపేశాడు. ఆ తర్వాత బాడీని ముక్కలు చేశాడు. తలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టాడు. మిగతా బాడీని ఓ బాక్స్ లో పెట్టి ఉంచాడు. ఆ రాత్రే సప్నతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. రుప్సా నది దగ్గర వారిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాతిరోజు అతని ఉంటున్న ఇంట్లో కవిత బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ విచారణలో…

కవితని చంపినట్లు పోలీస్ విచారణలో అబు బకర్ ఒప్పుకున్నాడు. ఆమె చేతులు ప్లాస్టిక్ కవర్‌లో కట్టి గోబర్చాక నగర శివారులో పడేశానని చెప్పాడు. అచ్చం ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ని అఫ్తాబ్ అమీన్ పూనావాల చంపినట్టే చంపాడు. ఈ రెండు ఘటనలు ఒకే తరహాలో ఉన్నాయి. వీరి హత్యల వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని వీహెచ్పీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగాయని గుర్తు చేస్తున్నారు.