హిమాయత్ నగర్‌లో కీచకం.. బాలిక ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

హిమాయత్ నగర్‌లో కీచకం.. బాలిక ఆత్మహత్య

September 25, 2020

Girl commits incident in Himayat Nagar

హిమాయత్ నగర్‌లో దారుణం జరిగింది. ఇంటి యజమాని లైంగిక వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న హిమాయత్ నగర్‌లో చోటు చేసుకుంది. హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన బాతుకు మధు యాదవ్ ఇంట్లో నజియా(17), ఆమె చెల్లెలు అఫ్రీన్ పాచి పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.

అయితే గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో నజియా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటి యజమాని లైంగిక వేధింపుల వల్లే బాలిక మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా యజమాని వేధింపులు ఎక్కువ అవడంతో భరించలేని బాలిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.