ఆశీర్వాదం ఇవ్వబోతుంటే.. హై ఫై కొట్టింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఆశీర్వాదం ఇవ్వబోతుంటే.. హై ఫై కొట్టింది (వీడియో)

October 23, 2020

Priest

చిన్న పిల్లలు ఏది చేసినా ముద్దు ముద్దుగా ఉంటుంది. తెలిసి తెలియని తనంతో వారు చేసే పనులు కొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి. ఇటీవల ఓ చిన్నారి చేసిన పని కూడా నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. చర్చికి వెళ్లిన ఆమె ఆశీర్వాదం తీసుకోకుండా పాదర్‌కు హై ఫై ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 

ఓ చిన్నారి తన తల్లితో కలిసి చర్చిలో ఫాదర్ వద్దకు వెళ్లింది. అక్కడ అతడు ఏదో చెబుతూ.. ఆశీర్వాదం ఇస్తూ చేయి పైకి లాపారు. అతడి చూసిన ఆమె తనకు అతడు  హై ఫై ఇస్తున్నాడేమోనని భావించి అతడి చేతిని తన చేతితో తాకింది. వెంటనే ఆమె తల్లి పాపకు సర్ధి చెప్పి ఆశీర్వాదం తీసుకోవాలని చేయిని తీసివేసింది. పాప అమాయకత్వాన్ని చూసి ఫాదర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. నవ్వుతూనే ఆశీర్వదించి పంపించాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.