మైక్‌టీవీ గర్ల్ ఇన్ ద సిటీపై మీడియా ప్రశంసలు - MicTv.in - Telugu News
mictv telugu

మైక్‌టీవీ గర్ల్ ఇన్ ద సిటీపై మీడియా ప్రశంసలు

February 15, 2018

వాలెంటైన్స్ డే సందర్భంగా మైక్ టీవీ హైదరాబాద్ నగరజీవితంపై రూపొందించి, ప్రసారం చేసిన ‘గర్ల ఇన్ ద సిటీ’ వీడియో సాంగ్‌కు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ద హిందూ, దక్కన్ క్రానికల్.. మరెన్నో జాతీయ, స్థానిక దినపత్రికలు ప్రశంసిస్తూ వార్తలు రాశాయి. దివంగత హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె, దర్శకురాలు శశికిరణ్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ పాటలో ఆమె కుమార్తె శ్రీనైరుతి నటించడం విశేషం. 
హైదరాబాద్ నగరంపై తన ప్రేమకు ఈ పాటొక కవితాత్మక కనుక అని శశికిరణ్ చెప్పారు. పాటపై, హైదరాబాద్ నగరంపై ఆమె అభిప్రాయాలను ఈ పత్రికలను ప్రముఖంగా ప్రచురించాయి. తన బాల్యం భీమవరంలో గడిచిందని, అయితే రెండు దశాబ్దాల కింద హైదరాబాద్‌కు వచ్చానని ఆమె చెప్పారు. ‘నా కూతురితో, కెమరామన్‌తో కలసి ఒక రోజు నగరంలో చక్కర్లు కొడుతూ ఎన్నో దృశ్యాలను చిత్రీకరించాను. తర్వాత పాట తయారైంది. నేనొక సంచారిని. కొత్త సంస్కృతులను అన్వేషిస్తుంటాను.. ’ అని ఆమె తెలిపింది. గోల్కొండ, చార్మినార్, ట్యాంక్ బండ్‌లతోపాటు కాచిగూడ, బేగంపేట్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో నైరుతి తిరుగుతున్న దృశ్యాలను శశికిరణ్ చిత్రికపట్టారు.

నగర యువతిగా నైరుతి జీవనశైలిని చిత్రించిన తీరు బావుందని పత్రికలు కొనియాడాయి. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నైరుతి తల్లికి తగ్గ తనయ అని పేర్కొన్నాయి. శశిలాగే ఆమెకూ పెద్ద బైకులను నడపడం అంటే ఇష్టమని తెలిపాయి.