రాష్ట్రపతి భవన్‌ ముందు అర్ధరాత్రి బాలిక మెరుపు నిరసన  - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి భవన్‌ ముందు అర్ధరాత్రి బాలిక మెరుపు నిరసన 

October 17, 2020

nbv jgjbn

ఢిల్లీలో అర్ధరాత్రి 9 ఏళ్ల బాలిక మెరుపు నిరసనకు దిగింది.  రాష్ట్రపతి భవన్‌ ముందు ప్లకార్డు పట్టుకొని దీక్ష చేసింది. రాత్రి అంతా రోడ్డుపైనే ఉండిపోయి తెల్లవారుజామున విరమించింది.  పర్యావరణ కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ  లిసిప్రియా కంగుజమ్‌ ఈ విధంగా ఆందోళన చేపట్టింది. అక్కడి ప్రజలు ఎవరూ గాలిని పీల్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాలికతో పాటు మరికొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు కూడా జత చేరారు.  

తమకు శాశ్వత పరిష్కారం కావాలని ఆ బాలిక డిమాండ్ చేసింది. దీనిపై రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్ప పరిష్కారం చూపడం లేదని విమర్శించింది. పర్యావరణ కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా  60 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆమె గుర్తు చేసింది. నిరసన ప్రదర్శన తర్వాత సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి తమ డిమాండ్‌లు వినిపించారు. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను మూసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ చిన్నారి మెరుపు దీక్ష ఇప్పుడు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది.