Girl Rescues Baby Elephant Stuck In Muddy Ditch
mictv telugu

ఏనుగును ఎత్తేసిన అమ్మాయికి.. ఆ మూగజీవి థ్యాంక్స్ … వీడియో

November 1, 2022

Girl Rescues Baby Elephant Stuck In Muddy Ditch

మనుషులకే కాదు జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో ఎక్కువ ఎమోషన్స్ మనం చూడొచ్చు..మనుషులకు దగ్గరగా ఉండడంతో మనషులతో ఎక్కువ సంబంధాన్ని కలిగిఉంటాయి..వాటిని మనం అపురూపంగా చూసుకుంటే అవి కూడా మనపై ఎమోషన్స్ చూపిస్తాయి…అయితే అడవిలో పెరిగే ఏనుగులు ఎమోషన్స్‌ని సరిగ్గా అర్థం చేసుకోగలవు. సహజంగా అవి మనుషుల జోలికి రావు..వాటి జోలికి ఎవరైనా వెళ్తే వారిపై ఏనుగులు విరుచుకుపడ్తాయి.. అలాంటి ఏనుగుల వద్దకు దగ్గరకు వెళ్లాలంటేనే కొందరు జంకుతారు. ఏం చేస్తోందనో భయపడతారు. అయితే బురదలో కూరుకుపోయిన ఓ ఏనుగుకు వద్దకు ఓ అమ్మాయి వెళ్లి తన వంతు సాయం చేసింది… ఆమె చేసిన సాయానికి ఏనుగు తొండం ఎత్తి ఆశీర్వదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఒక చెరుకు పొలానికీ, రోడ్డుకీ మధ్య బురదలో ఏనుగు కాళ్లు చిక్కుకుపోయాయి. అది చూసిన ఓ అమ్మాయి ఏనుగు దగ్గరికి వెళ్లి గజరాజు కాళ్ళని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకు అంత బలం లేదు. ఆ ఏనుగు దాడి చేస్తుందేమో అనే భయం లోలోపల ఉన్నా.. మంచి మనసుతో ఆ అమ్మాయి.. ప్రాణాలకు తెగించింది. ఆమె తాలూకు వాళ్లు.. జాగ్రత్త అని చెబుతున్నా.. ఆమె వెనక్కి తగ్గలేదు. తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది. తను కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నించింది. ఇలా రెండువైపులా జరిగిన ప్రయత్నం ఫలించింది. వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా.. తొండంతో ఆశీర్వదించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అందులోని అమ్మాయిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.