అక్క మొగుడే.. యముడయ్యాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్క మొగుడే.. యముడయ్యాడు..

October 16, 2018

భార్య చెళ్లెలుపై కన్నుపడిన ఓ భర్త తనను ప్రేమించాలని వేధించాడు. చంపేస్తా, కేసు పెడతా అని బెధిరించాడు. అక్కను చేసుకున్న బావే ఇలా నిత్యం వేధించి.. మానసికంగా నరకం చూపిస్తున్నాడని మనస్థాపానికి గురైంది. చివరకు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటు చేసుకుంది.Girl suicide for Brother in law harassment in Khammam చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల భిక్షమయ్యకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు సుష్మను అదే మండలం సింగరాయపాలెంకు చెందిన మోటపోతుల అశోక్‌కు ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇతను కొత్తగూడెం క్రైంబ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా అశోక్ తనను ప్రేమించాలని మరదలు అనూష (21)ను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో పెద్దలు తప్పని మందలించారు. అయినా అశోక్ ఆమెను వదిలిపెట్టలేదు. అత్తగారి ఊరికి వచ్చిన అశోక్ అనూషకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి కేసు పెట్టినట్లు, కోర్టుకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తారని ఉంది. ఈ నోటీసును పక్కింటి అమ్మాయితో అశోక్ అనూషకు పంపించాడు.

దీనికి భయపడిన అనూష తల్లికి విషయం తెలిపి, తండ్రిని పిలుచుకురమ్మని తల్లిని బయటకు పంపింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు. తన అల్లుడి వేధింపుల కారణంగానే కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.