అందంగా ఉన్న నా జీవితాన్ని...అంధకారం చేశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

అందంగా ఉన్న నా జీవితాన్ని…అంధకారం చేశారు..!

August 9, 2017

నిజంగా ఈ అమ్మాయికి  జరిగిన అన్యాయం గురించే తెలిస్తే…ఎంతటి కఠిన హృదయమైనా చలించక మానదు.ఎవరో చేసిన తప్పుకు పాపం ఈ అమ్మాయి బలై పోయింది.ఆమె భవిష్యత్ మొత్తం ప్రశ్రార్ధకంగా మారింది.సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలోకి  కారు రూపంలో.. కారు చీకట్లు దూసుకువచ్చాయి.

ఈమె పేరు సౌజన్య..ఎవ్వరూ లేని అనాథ. తనకెవరూ లేరనే బాధను దిగమింగుకుంటూనే..దేవుడు తనకిచ్చిన జీవితాన్ని ఎలాగైనా బ్రతకాలి అన్న ఆశతో యాడాదికింద ఆదిలాబాద్ నుంచి హైద్రాబాద్ వచ్చింది.ఇక్కడే  ఓ కంపెనీలో సేల్స్ గర్స్ గా పనిచేసుకుంటూ  తన కాళ్లపై తాను నిలబడి బ్రతుకుతుంది.అయితే ఈమద్య జూలై 26 నాడు సౌతిండియా షాపింగ్ మాల్ లో పనిచేస్తుండగా…టీ బ్రేక్ కోసం సెల్లార్ లోకి వచ్చింది ..అంతలోనే  వేగంగా దూసుకువచ్చిన కారు ఒక్కసారి ఆమె కాలు పైకి ఎక్కింది. సౌజన్యను సోమాజిగూడ యశోదా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. స్పృహలోకి వచ్చిన సౌజన్య తన పరిస్థితిని చూస్కొని ఒక్కసారిగా షాక్ గురైంది.కారు కాలు మీదికి ఎక్కడంతో డాక్టర్లు ఆమె కుడికాలును తీసేసారు.ఏదో అప్పటి పూర్తి  దవాఖాన్లో చేర్పించి చేతులు దులుపుకుంది సౌజన్య పనిచేస్తున్న కంపెనీ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లు.పాపం సౌజన్యను పట్టుచ్చుకునే వారే కరువయ్యారు. ఓ వైపు కేసు నమోదు చేసిన పోలిసులు కూడా ఎలాంటి దర్యాప్తు చేయక  వదిలేసారని సౌజన్య చెప్తుంది.

నాకాళ్లమీద నేను నిలబడి బ్రతుకుతుంటే  నన్ను కుంటిదాన్నిచేసారు.అందంగా బ్రతుకుదామనకున్న నాజీవితాన్ని అంధకారంలో తోసేసారు.’’నాజీవితం ఇంతేనా-నా భవిష్యత్ ఏంటి” అని  వెక్కి వెక్కి ఏడుస్తుంటే  చుట్టూ ఉన్న వారు కన్నీటి పర్యాంతమయ్యారు.పాపం సౌజన్య రెండో కాలు గుడ ఫ్యాక్ఛర్ అయ్యింది.నడవలేని పరిస్ధితి.దగ్గరుండి చూసుకోనికి ఎవ్వరూ లేరి దయనీయ స్ధితి.

ఓ వైపు కారు గుద్ది  నాకాలు పోగొట్టినోడు చలించడంలేదు,తప్పు చేసినప్పుడు దానికి తగ్గ బాద్యత అతన్ని కాదా?డ్యూటిలో ఉండగా నాకు ప్రమాదం జర్గింది,అయినా నేను పనిచేసిన కంపెనీ వాళ్లు మాకేం సంబంధంలేదన్నట్టు చేతులు దులుపుకున్నారు.పట్టించుకోవడానికి నా అన్న వాళ్లు ఎవ్వరూ లేరు.దీనితో వేరే దారిలేక ఆదుకునే వారికోసం ఎదురు చూస్తుంది సౌజన్య..అయ్యా నన్ను కాపాడండి,దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నాకు పూర్తిగా అనుభవించాలని ఉంది.ప్లీజ్  దయచేసి నా ట్రీట్ మెంట్ కు సహాయం చేసి నా జీవితంలో వెలుగులు నింపండి… అని అందరిని ప్రాధేయ పడుతుంది సౌజన్య.