దొంగ మొగుడికి ప్రియురాలి కారంపొడి ట్రీట్‌మెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

దొంగ మొగుడికి ప్రియురాలి కారంపొడి ట్రీట్‌మెంట్

April 6, 2022

bnmbg

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఓ ప్రియురాలు తన దొంగ మొగుడికి కారంపొడి ట్రీట్‌మెంట్ ఇచ్చిన సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన యువరాజు.. సత్తుపల్లిలో ధమ్ బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. అతని భార్య కస్తూరి స్వగ్రామంలోనే ఉంటుంది. ఈ క్రమంలో యువరాజు తన హోటల్‌లో పనిచేస్తున్న సత్వవతి అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.

అయితే, కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సత్యవతి బిర్యానీ సెంటర్‌ దగ్గరికి వచ్చి మరీ కారం పొడితో దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అంతేకాకుండా తన వల్లే యువరాజు ఈ స్థాయికి వచ్చాడని, అలాంటి తననే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ సత్యవతి ఆందోళన చేపట్టింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరిపైనా ఆగ్రహం వెల్లగక్కింది. పైగా డబ్బులు మొత్తం అతని భార్య పిల్లలకే పంపిస్తున్నాడంటూ గోల చేసింది. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

మరోపక్క ఇటీవలే సూర్యాపేట జిల్లా కోదాడలో తన కొడుకు గంజాయికి అలవాటు పడి తమ పరువు తీస్తున్నాడని కొడుకికి కంట్లో కారం పెట్టిన ఘటన ఎంత వైరల్ అయింతో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో ఆ ఘటనను ఆదర్శంగా తీసుకొని, సత్తుపల్లిలో ఓ ప్రియురాలు తన దొంగ మొగుడికి బుద్ది చెప్పింది.