ఆమెది ఝార్ఖండ్, ఆ యువకుడిది యూపీ. రెండు రాష్ట్రాల సరిహద్దు వీరి ప్రేమాయణానికి వేదికైంది. ఆమెకు ఇంతకుముందే పెళ్లయినా పర్వాలేదనుకుని.. తనతో పాటు తీసుకెళ్లాడు. తాను పనిచేసే చోటే ఓ గది అద్దెకు తీసుకొని సహజీవనం కూడా మొదలెట్టారు. మొదట్లో అంతా బాగానే నడిచింది. ఈలోపు ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టడంతో.. ఆమెను తిరిగి ఇంట్లో వదిలివెళ్లాడు. అప్పటి నుంచి ఎవరూ లేని వేళల్లో డైరెక్ట్ గా ఆమె ఇంటికే వస్తున్నాడు. కానీ వ్యవహారం శృతిమించడంతో పెద్దలు కలుగజేసుకోలేక తప్పలేదు. సరాసరి ఆమె ఇంటికే రావడంతో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని చితకబాదారు. పెళ్లైన మహిళతో ఇలాంటి సంబంధాలేంటని చావగొట్టి నాలుక కట్ చేశారు. చివరకు అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆస్పత్రిలో చేరాడు.
అనిల్ యాదవ్ అనే వ్యక్తి యూపీలోని వింధామ్‌గంజ్ పీఎస్ పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం హరియాణాలో నివసిస్తూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వింధామ్‌గంజ్ కు ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్వాకు చెందిన వివాహితతో అతనికి సంబంధం ఏర్పడింది. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ప్రేమాయణం సాగించారు. ఆదివారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. అనిల్ రాకను గమనించిన కొందరు వ్యక్తులు.. కర్రలతో రక్తమొచ్చేలా కొట్టి, ఆ తర్వాత ఒక పదునైన ఆయుధంతో అతని నాలుకను కోసేశారు. ఘటన అనంతరం రక్తపుమడుగులో ఉన్న యువకుడు ఎలాగోలా అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని చూసి షాక్‌కు గురయ్యారు.
వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ‘అతని నాలుకను 2 నుంచి 3 అంగుళాలు కత్తిరించారు. అతనికి ఆపరేషన్ చేసి కుట్లు వేశాం. ప్రస్తుతం యువకుడు మాట్లాడలేకపోతున్నాడు’ అని కొనసాగుతోందని జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనూప్ సిన్హా తెలిపారు