అబ్బాయిల కంటే.. అమ్మాయిలే బెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బాయిల కంటే.. అమ్మాయిలే బెటర్

May 29, 2022

దేశవ్యాప్తంగా ఇటీవలే 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులపై రాష్ట్రాల వారీగా జాతీయ స్థాయిలో అధికారులు ఓ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలను అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అబ్బాయిల కంటే, అమ్మాయిలే చదువు పరంగా ముందు వరుసలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొదటగా మూడోవ తరగతి విద్యార్థులపై సర్వే చేశారు. బేసిక్స్, బిలో బేసిక్స్ లెవల్‌లో నేషనల్ యావరేజ్ 59 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 77.1 శాతం విద్యార్థులు బేసిక్స్, బిలో బేసిక్స్ లెవల్‌లో ఉన్నారని, విద్యను అర్థం చేసుకుని, అడ్వాన్స్ లెవల్‌లో ఉన్నవారు 22.9 శాతం విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. లాంగ్వేజీల్లో బేసిక్స్, బిలో బేసిక్స్‌లో రాష్ట్ర సగటు 48 శాతం ఉంటే, దేశ సగటు 62 శాతంగా ఉందని అన్నారు.

సర్వే వివరాల ప్రకారం..”ఐదోవ తరగతి విద్యార్థులు నేషనల్ యావరేజ్ 49 శాతం ఉంటే, తెలంగాణ రాష్ట్రం బేసిక్స్, బిలో బేసిక్స్ లెవల్‌లో 77.1 శాతంగా ఉంది. ఇక, 8వ తరగతిలో నేషనల్ యావరేజ్ 41.9 శాతం ఉంటే, తెలంగాణలో 85.4 శాతం మంది బేసిక్స్, బిలో బేసిక్స్ లెవల్‌లోనే ఉన్నారు. పదోవ తరగతి విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జాతీయ సగటు 37.8 శాతం ఉంటే, రాష్ట్రంలో 80.4 శాతం మంది విద్యార్థులు బేసిక్స్, బిలో బేసిక్స్ లెవల్‌లో ఉన్నారు.”

దేశవ్యాప్తంగా లాంగ్వేజ్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వంటి సబ్జెక్టుల విషయానికొస్తే.. మూడోవ తరగతిలో ప్రతి వంద మందిలో 52 మంది విద్యార్థులు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో పూర్ స్టేజీలో ఉన్నారు. గణితంలో 43 మంది బిలో బేసిక్ స్టేజీలో ఉన్నారు. ఇక, తెలంగాణలో ఐదోవ తరగతి విద్యార్థుల్లో లాంగ్వేజీల్లో 35 శాతం, గణితంలో 49 శాతం మంది బిలో బేసిక్ లెవల్‌కు దిగువన ఉన్నారు. ఎనిమిదో తరగతిలో లాంగ్వేజీల్లో వందకు 28 మంది, గణితంలో 32, సైన్స్‌లో 47, సోషల్ స్టడీస్‌లో 54 మంది బిలో బేసిక్స్ లెవల్‌లో ఉన్నట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.