అమ్మాయి అబలలు కారు. తేడా వస్తే తాట తీసి పారేస్తారు. వారితో అతిగా ప్రవర్తించే రోడ్డు రోమియాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇటీవల మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను ఓ ఆకతాయి లైంగికంగా వేధించాడు. అయితే అమ్మాయిలు బెదిరిపోలేదు. వాడిపై తిరగబడ్డారు. జనం పోగయ్యారు. అమ్మాయిలు వాడిని చెప్పుదెబ్బలతో వాయించి పడేశారు. జనం వారి ధైర్యాన్ని మెచ్చకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలాంటి వీడియోలను సూళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కీచకులను హెచ్చరికగా ఉంటుందని, యువతులకు ధైర్యాన్నిస్తుందని జనం చెబుతున్నారు.