రోజా పూలతో హీరో వెంటపడ్డ అమ్మాయిలు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

రోజా పూలతో హీరో వెంటపడ్డ అమ్మాయిలు.. వీడియో వైరల్

March 22, 2022

 

bfgfd

బాలీవుడ్‌ యంగ్ హీరో, లవర్ బాయ్ కార్తీక్ ఆర్యన్‌కు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడైనా బయట కనిపిస్తే, అభిమానులు ఆనందం తట్టుకోలేక ఓ సెల్పీ కోసం పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీక్ వేకేషన్‌ కోసం గోవా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, ముంబై ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇద్దరు అమ్మాయిలు ఎర్ర గులాబీలు పట్టుకొని కార్తీక్ వెంటపడ్డారు. అది చూసిన హీరో సిగ్గుపడుతూ వారి దగ్గర నుంచి వాటిని తీసుకున్నాడు. అంతేకాకుండా వారితో కలిసి ఫొటోలకి స్టిల్స్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆయన ఫాలోయింగ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


మరోపక్క కొన్ని నెలల క్రితం ఇద్దరు అమ్మాయిలు ఆయన ఇంటి వద్దకు వెళ్లి, ఆయన బయటికి రావాలంటూ నానా రచ్చ చేశారు. తాజాగా కార్తీక్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఇటువంటి సమయంలో ఆయనకు ఓ ఇద్దరు అమ్మాయిలు ఎయిర్ పోర్టులో వెంటపడి పువ్వు ఇవ్వడం సంచలనంగా మారింది.