ఏపీలో నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు

April 23, 2022

కాలేజ్‌కు వెళ్లి బుద్దిగా చదువుకోవాల్సిన అమ్మాయిలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జుట్లు జుట్లు పట్టుకొని, పిడుగుద్దులు గుద్దుకున్న సంఘటన సంచలనంగా మారింది. కారణం ఏమిటో తెలియగాని, అక్కడ ఉన్న పలువురు కొట్టుకోవద్దు అని ఎంత వేడుకున్న అవేమి పట్టించుకోకుండా గట్టిగా కేకలు వేస్తూ, కాలేజ్ గేట్ ముందే పొట్లాడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాల ఆధ్వర్యంలో ఇరువురు విద్యార్థినిలు నడిరోడ్డుపై బాహాబహీకి దిగారు. కళశాల గేట్ బయట ఒకరిపై ఒకరు పిడుగుద్దులతో యుద్ధం చేశారు. ఈ ఘటనను వీక్షించిన అక్కడివారు అయ్యో ఈ కాలేజ్ అమ్మాయిలకు ఇంతలా కొట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఆశ్చర్యపోయారు. పలువురు విద్యార్థులు వారిని అపడానికి ప్రయత్నం చేసిన, వారి పోరాటం మాత్రం ఆపకుండా కొట్టుకున్నారు.