దుష్ట శిక్షణకు సిద్ధం.. మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థినులకు ట్రైనింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

దుష్ట శిక్షణకు సిద్ధం.. మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థినులకు ట్రైనింగ్

December 3, 2019

దేశవ్యాప్తంగా మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుతున్నాయి. వారు స్ట్రాంగ్‌గా ఉంటే ఏ కీచకుడూ వారిని ఏం చేయలేడు. వాళ్లు బాగా తినాలి, వ్యాయామం చెయ్యాలి.. బలంగా తయారవ్వాలి అని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే తనమీదకు దూసుకొస్తున్న మగ ఉన్మాదుల చమ్డాలు ఒలిచి డప్పు కట్టగలరు. వాళ్ల ఆత్మరక్షణ వారి చేతుల్లోనే ఉండాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఓ ఆలోచన చేసింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థినులకు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ రూ.1.38కోట్లు విడుదల చేసింది. 

Girls in govt.

రాష్ట్ర వ్యాప్తంగా 1,513 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే, జూడో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వారంలో రెండు మార్షల్‌ ఆర్ట్స్‌ తరగతులను.. గంట చొప్పున నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.3వేలు చొప్పున మంజూరు చేశారు. జాతీయ క్రీడా సంస్థలు లేదా యూనివర్సిటీ నుంచి జూడో, మార్షల్‌ ఆర్ట్స్‌లో సర్టిఫికెట్‌ ఉన్న శిక్షకుడిని నియమించనున్నట్టు ఉత్తర్వులలో తెలిపారు.