ప్రభుత్వం కీలకం.. విద్యార్థులకు డిగ్రీతో పాటే పాస్‌పోర్టు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వం కీలకం.. విద్యార్థులకు డిగ్రీతో పాటే పాస్‌పోర్టు..

July 12, 2020

Passport

దేశంలో చదువు అయిపోయాక విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పాస్‌పోర్టు సంపాదించడం ఓ పెద్ద పని. అయితే ఈ పనిని ప్రభుత్వమే చేసి పెడుతోంది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థునులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌తో పాటే.. పాస్‌పోర్టును కూడా అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ‘హెల్మెట్ ఫర్ ఎవ్రీ హెడ్’ అనే కార్యక్రమానికి హాజరైన సీఎం ఖట్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని చెప్పారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కళాశాలలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలావుండగా విద్యార్థులకు మరో అవకాశం కూడా కల్పించే దిశలో హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది. కళాశాలల్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చేలా కూడా హర్యానా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.