ప్రేమ పెళ్లి చేసుకోబోమని కాలేజీలో విద్యార్థినుల ప్రమాణం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమ పెళ్లి చేసుకోబోమని కాలేజీలో విద్యార్థినుల ప్రమాణం

February 15, 2020

girl.....

ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఓ కాలేజీలో విద్యార్థులంతా కలిసి మూకుమ్మడిగా ప్రమాణం చేశారు. తాము ప్రేమ పెళ్లిలు చేసుకోబోమంటూ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని చందూర్‌లో ఉన్న మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఇలా ప్రమాణం చేశారు. ప్రేమ వేధింపుల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసినట్టు కాలేజీ నిర్వాహకులు వెళ్లడించారు. దీనికి ఆ విద్యార్థినులు కూడా మద్దతు పలకడం విశేషం.

విద్యార్థులంతా గ్రౌండ్‌లో వరుసగా నిలబడ్డారు. వెంటనే అంతా కలిసి మూకుమ్మడిగా ప్రమాణం చేశారు. దాంట్లో ‘మాకు మా తల్లిదండ్రులపై పూర్తి నమ్మకం ఉంది. మేము ప్రేమలో పడిపోం.. ప్రేమ వివాహాలు చేసుకోం. వరకట్నం అధికంగా డిమాండ్‌ చేసే వారిని కూడా తిరస్కరిస్తాం” అంటూ ప్రమాణం చేశారు. దీనిపై విద్యార్థులు మాట్లాడుతూ..మన ఇష్టా ఇష్టాలకు అనుగుణంగానే మన తల్లిదండ్రులు పెళ్లిలు చేస్తారు. అలాంటప్పుడు ప్రేమ పెళ్లిలు ఎందుకని ఓ విద్యార్థిని అభిప్రాయపడింది. చాలా మంది మహిళలు, యువతులపై ప్రేమ పేరుతో అఘాయిత్యాలకు గురౌతున్నారని మరికొంత మంది చెప్పుకొచ్చారు.