గీతాంజలి రాసిన కవిత ‘అమ్మకో లేఖ’  మీకోసం - MicTv.in - Telugu News
mictv telugu

గీతాంజలి రాసిన కవిత ‘అమ్మకో లేఖ’  మీకోసం

November 23, 2017

అమ్మా. ..

చనిపొతున్నా..

చదవలేక పోతున్నా.

మన పశువుల కొట్టంలో

ఆవే నయమమ్మా…

దానికి కూడా

ఒక ముద్దు పేరుంది.

ఇక్కడ ఈ చదువుల కొట్టంలో..

నేనొక నంబర్ని మాత్రమే!

చదువంటే గాలే ఆడని సెల్లార్లో.

గురు సాక్షాత్ పిశాచాల చేతుల్లో….

థర్డ్ డిగ్రీ హింసే అయితే

ఈ చదువు నాకు వద్దమ్మా.

ఈ కార్పొరేటు ప్రయోగశాలలో

నేనొక ఎక్స్పెరిమెంటల్ జంతువునమ్మా….

ఇక్కడ ప్రతిరోజూ

బలికి సిధ్దమవ్వాల్సిందేనమ్మా! అమ్మా….

ఊపిరాడట్లేదు.

కలలు కూడా రావట్లేదు.

అమ్మ ఇచ్చిన టిఫిన్ డబ్బా పట్టుకొని…

నెచ్చెలులతో…. రైలు పట్టాలెంబడి_ చెరువుగట్లెంబడి

నడుస్తూ… పరిగెడుతూ. ..

నవ్వుతూ.. తుళ్ళుతూ

నీరెండల్లొ.. వానల్లొ

నీలాగ.. అచ్చం నీలాగ బడికెళ్ళాలని ఉందమ్మా

అమ్మా… మీకోసం

ఈ కార్పొరేటు ప్రయోగశాలలో

ర్యాంకు కోసం. ..

నేను చనిపొతున్నానమ్మా…

ఊపిరాడట్లేదమ్మా…. అమ్మా. …