పూర్తి జీతం ఇప్పించండి : ఏబీ వెంకటేశ్వరరావు - MicTv.in - Telugu News
mictv telugu

పూర్తి జీతం ఇప్పించండి : ఏబీ వెంకటేశ్వరరావు

March 25, 2022

 c

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి, వైఎస్ జగన్ సీఎం కాగానే సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్‌కు రెండేళ్లు కావొస్తుండడంతో ఆయన తాజాగా ఏపీ సీఎస్‌ సమీర్ శర్మకు లేఖ రాశారు. అందులో తనను ఇంకా సస్పెన్షన్‌లో ఉంచే అధికార ఏపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆరేసి నెలల చొప్పున జనవరి 27తో సస్పెన్షన్ ముగిసిపోయిందని గుర్తు చేశారు. రెండేళ్లకు మించి సస్పెండ్ చేయడం నియమాలకు విరుద్ధమని తెలియజేశారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. కాగా, గడువు లోపల ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకోనందున సస్పెన్షన్ ముగిసినట్టేనని వివరించారు. కావున, సర్వీస్ రూల్స్ ప్రకారం తనకు పూర్తి జీతం చెల్లించాలని లేఖలో కోరారు.