దేశం కోసం ప్రాణాలు ఇస్తా: కేజ్రీవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

దేశం కోసం ప్రాణాలు ఇస్తా: కేజ్రీవాల్

March 31, 2022

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం కోసం నా ప్రాణాలు ఇస్తాను” అని అన్నాడు. ఈ వ్యాఖ్య దేశ‌ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతుంది. బుధవారం ఢిల్లీలోని త‌న ఇంటిపై బీజేవైఎం శ్రేణుల దాడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేజ్రీవాల్‌ను హ‌త్య చేసేందుకు బీజేవైఎం య‌త్నించింద‌ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఢిల్లీలో ఈ-ఆటోల‌ను కేజ్రీవాల్ ప్రారంభించారు.

 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”కేజ్రీవాల్ ముఖ్యం కాదు. ఈ దేశ‌మే ముఖ్యం. దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. దేశంలోనే అతిపెద్ద పార్టీగా కొన‌సాగుతున్న బీజేపీ ఇలా గుండాయిజం చేస్తూ, దాడుల‌కు పాల్ప‌డ‌కూడ‌దు. బీజేపీ అనుస‌రించే ఈ చ‌ర్య‌ల వల్ల దేశ యువ‌త‌కు త‌ప్పుడు సంకేతాలను పరోక్షంగా ఇచ్చిన‌ట్టే” అని కేజ్రీవాల్ మండిపడ్డారు. క‌లిసి క‌ట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం అందరిపైనా ఉందని, 75 ఏళ్లుగా క‌ల‌హాల‌తో, కుట్రలతో ఈ దేశాన్ని అంధకారంలో ఉంచేశామని అన్నారు.