ఎన్నికల ప్రచారానికి డబ్బులేవ్.. కిడ్నీలు అమ్ముకుంటా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల ప్రచారానికి డబ్బులేవ్.. కిడ్నీలు అమ్ముకుంటా..

April 16, 2019

ఎన్నికల ప్రచారానికి తన దగ్గర డబ్బుల్లేవంటూ ఓ అభ్యర్థి వీధిన పడ్డారు. తనకు రూ.75 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషోర్ సమ్మిట్ ఎన్నికల అధికారులకు లేఖ రాశాడు. ఆయన బాలాఘాట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్  అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

తన ప్రత్యర్థులంతా డబ్బున్న వాళ్లని, తన దగ్గర మాత్రం చిల్లిగవ్వ లేదని ఆయన అంటున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ అభ్యర్థి రూ.75 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయొచ్చు. అంత డబ్బు తన దగ్గర లేదని, ఎన్నికలకు కేవల 15రోజులు మాత్రమే సమయం ఉందని ఆ లోపు 75 లక్షలు సమకూర్చుకోవడం కష్టమని కిషోర్ వాపోతున్నాడు. అంతేకాదు, ఆ డబ్బును ఈసీ సమకూర్చాలని, లేదా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. అలా కూడా కుదరకపోతే తన కిడ్నీలు  అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీకి లేఖ రాశారు. నియోజకవర్గంలో తనపై పోటీకి దిగిన అభ్యర్థులంతా అవినీతి పరులని, డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని, అందుకే తాను ఈసీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

Give me Rs 75 lakh or allow me to sell kidney Balaghat candidate to EC.

గే ‘భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు పీఎంలు, సీఎంలు కావచ్చు. కానీ డబ్బున్న వారే పోటీకి దిగుతున్నారు. ఈసీ నియమాలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఖర్చు చేసేందుకు అనుమతి ఇవ్వొద్దని ఈసీకి తెలిపేందుకే ఇలా లేఖ రాశాను. ఇప్పుడున్న ఈసీ నిబంధనలు మొత్తం మారాలి. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు ఈసీ ఎందుకు అనుమతి ఇవ్వాలి? ధన బలం ఉన్నవారే అధికారంలోకి రావాలా? సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాడు. ఇప్పటి నుంచి అయినా ఎన్నికలు నిజాయితీగా, ఫ్రీగా జరగాలి’  అని కిషోర్‌ అన్నారు.