పోలీసు ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి: ట్రాన్స్‌జెండర్లు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసు ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి: ట్రాన్స్‌జెండర్లు

May 19, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీసు ఉద్యోగాలకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని పలువురు ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, పురుషులకు ఏ విధంగా అవకాశం ఇస్తున్నారో వారితో సమానంగా తమకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని వినతపత్రం అందజేశారు.

ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వలలు మాట్లాడుతూ..” అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్‌జెండర్లకు ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ, జీవో ఇచ్చింది. ఆ ప్రకారమే ఇప్పుడు తెలంగాణలో జీవో ఇవ్వండి. మాకు పోలీసు ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి. పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మాకు 45 రోజుల సమయం ఇవ్వండి. దరఖాస్తు ఫారమ్‌లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్‌జెండర్‌ ఆప్షన్‌ కూడా జోడించండి” అని వారు డిమాండ్‌ చేశారు.