దుర్గామాత కోసం మట్టిని ఇవ్వం… సెక్స్ వర్కర్లు - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గామాత కోసం మట్టిని ఇవ్వం… సెక్స్ వర్కర్లు

September 26, 2018

పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని సొనాగాచీ ప్రాతం నుంచి దుర్గామాత విగ్రహానికి మట్టి ఇవ్వమని ఆప్రాంతం వాసులు తేల్చి చెప్పారు. దుర్గామాత విగ్రహం తయారు చేయడానికి వేశ్వవాటికల నుంచి మట్టిని సేకరించి దుర్గమాతను పూజిస్తారు. దీనివల్ల శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సోనాగాచీ కూడా రెడ్‌లైట్ ఏరియా అవడంతో మట్టిని అడిగారు. కానీ గత మూడేళ్ల నుంచి అక్కడి ప్రజలు మట్టిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.  Give the soil for coughing ... why discrimination against us ...ఈ విధానాన్ని  వివక్ష చూపడంగా పరిగణిస్తున్న అక్కడి ప్రజలు మట్టిని ఇవ్వడాన్ని నిరాకరిస్తున్నారు. ఈ విషయమై సెక్స్ వర్కర్స్ అసోసియేషన్ దర్బార్ సమోనాయ్ కమిటీ సభ్యురాలు శుశ్రీ భారతీ డే మాట్లాడుతూ.. ‘మిగతా ప్రజల్లా కాకుండా సెక్స్ వర్కర్లను వేరుగా చూడటాన్ని వ్యతిరేకిస్తూ మట్టి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాం. సెక్స్ వర్కర్లు కూడా సామాన్య మనుషులే.. మమ్మల్నీ మీలో ఒకరిగా చూసి, మాపట్ల వివక్ష చూపడం మానుకోవాలి’ అని ఆమె సూచించారు.