Glare on Rishi Sunak after minister quits over slurs
mictv telugu

టెన్షన్‌లో రిషి సునాక్…ఎందుకిలా?

November 10, 2022

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సరైన కేబినెట్‌ని ఎంచుకోలేదా? దూషణల వివాదంలో మంత్రి గవిన్ విలయమ్‌సన్ రాజీనామా విపక్షాలకు అస్త్రంగా మారిందా? రిషి సునాక్ పై విపక్షాలు ఎందుకు ఒత్తిడి పెంచుతున్నాయి? ఈ సవాళ్లను రిషి సునాక్ తట్టుకోని నిలపడుతారా?బ్రిటన్‌లో అసలేం జరుగుతోంది?

దూషణల పర్వం..మంత్రి ఔట్…

కన్జర్వేటివ్ పార్టీ సహచరుడ్ని దూషించిన కేసులో శాఖ కేటాయించని మంత్రి గవన్ విలియమ్ సన్ రాజీనామా చేశారు. ఇతను రిషి సునాక్ కు నమ్మకమైన వ్యక్తి. ప్రధానమంత్రి రేసు నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకునేలా కీలక పాత్ర వహించారు. గవిన్ పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా కేబినెట్‌లోకి రిషి సునాక్ తీసుకున్నారు. దూషణల ఫిర్యాదుపై కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ జెక్ జెర్రీ చెప్పినా రిషి పట్టించుకోలేదు. ప్రతివారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగే పీఎం క్వశ్చన్ అవర్‌లో దీనిపై విపక్షాలు ఒత్తిడి పెంచాయి.

పశ్చాతాపడుతున్నా…

గవిన్ విలియమ్ సన్ మంత్రిగా నియమించినందుకు పశ్చాతాపడుతున్నానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ఇంతకాలం విశ్వసంగా ఉన్నందుకు ధన్యావాదాలు తెలిపారు. లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత మళ్లీ బోరిస్ జాన్సన్ పోటీకి రాకుండా చూడటంలో గవిన్ కీ రోల్ పోషించారు.

విలియమ్‌సన్ వెర్షన్
దూషణల వివాదంపై గవిన్ విలయమ్‌సన్ స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఈ ఆరోపణలతో మసకబారుతున్నాయని అన్నారు. బ్రిటన్ అసలే సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో విపక్షాల ఒత్తిడి రిష్ సునాక్ పై ఎక్కువగా ఉంది. వీటిని తట్టుకుని నిలపడుతారా అనేది ఆసక్తిగా మారింది.