కృత్రిమ నాలుక.. రుచి బాధలకు చెక్..  - MicTv.in - Telugu News
mictv telugu

కృత్రిమ నాలుక.. రుచి బాధలకు చెక్.. 

August 10, 2019

Glasgow scientists.

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు కృత్రిమ నాలుకను తయారు చేశారు. అల్యూమినియం, బంగారం లోహాలను ఉపయోగించి  దీన్ని ఆవిష్కరించారు. ఈ నాలుక అచ్చం నిజం నాలుకలాగే పనిచేస్తుందని పరిశోధకులు అలస్ డేర్ క్లార్క్ తెలిపారు. ఇది ప్రమాదకర రసాయనాల రుచి చూస్తుంది. విషయంలోకి వెళ్తే.. కొన్ని రసాయనాల రుచి చూడకపోతే పని జరగదు. అవి ప్రమాదకర రసాయనాలైతే ప్రాణాలు పోతాయి. ఆ ముప్పు తప్పించడానికే కృత్రిమ నాలుకను రూపొందించారు. ప్రధానంగా దీన్ని ఆల్కహాల్‌లో కల్తీని నిరోధించడానికి తయారుచేశారు. కల్తీని ఇది ఇట్టే పసిగట్టేస్తుందని చెప్పారు. చిన్నచిన్న తేడాలను గుర్తిస్తుందని, 99 శాతం కచ్చితత్వంతో చెబుతుందని పరిశోధకులు అంటున్నారు. 

12, 15, 18 ఏళ్ల క్రితం ఆల్కహాల్‌ల మధ్య తేడాను కూడా ఇది కనిపెట్టగలదని క్లార్క్ చెప్పారు. దీనిని ఇప్పటికే చాలా మంది అభిృద్ధి చేశారని, అయితే రెండు వేర్వేరు రకాల నానోస్కేల్ మెట్ రుచి గ్రాహికలను ఉపయోగించి.. ఒకే నాలుక పని చేసేలా తయారు చేయడం ఇదే తొలిసారని తెలిపారు. 

ఎలా పనిచేస్తుంది..
బంగారం, అల్యూమినియం లోహాలతో తయారైన ఈ నానోస్కేల్ రుచి గ్రాహికలపై తొలుత విస్కీ నమూనాలను పోశారు. ఈ రుచి గ్రాహికలు మన నాలుకలోని రుచి గ్రాహికల కంటే 500 రెట్లు చిన్నవి. ఆ తర్వాత ద్రవంలో మునుగుతున్న కొద్దీ ఆ గ్రాహికలు కాంతిని ఎలా శోషించుకుంటాయి. అవి కాంతిని శోషణం చేసుకునే తీవ్రతను బట్టి నమూనాల మధ్య తేడాలను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాన్ని ప్లాస్మోనిక్ రెసోనెన్స్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు.