కరోనా చికిత్స.. టాబ్లెట్ ధర తగ్గించిన గ్లెన్‌మార్క్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా చికిత్స.. టాబ్లెట్ ధర తగ్గించిన గ్లెన్‌మార్క్

July 13, 2020

Glenmark

కరోనా చికిత్స కోసం వచ్చిన ఒకటి రెండు మందుల ధరలు హడలెత్తిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు దళారులు బ్లాక్‌లో వాటిని కళ్లు తేలిపోయే ధరలకు విక్రయిస్తున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్లెన్‌మార్క్ ఫార్మా తాజాగా ప్రజలకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే ఫవిపిరవిర్ ట్యాబెట్ ధరను తగ్గిస్తున్నట్ట ప్రకటించింది. ఇప్పటికే ఫవిపిరవిర్ టాబ్లెట్ ధర రూ.103 ఉండగా దాని ధరను రూ.75కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ధరలో 27 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది. ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై మంచి ఫలితాన్ని ఇస్తోందని కంపెనీ తెలిపింది. 

కరోనా సోకినవారు తొలి రెండు రోజులు రెండుసార్లు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను వేసుకోవాలని.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్ల చొప్పున వేసుకోవాలని చెప్పింది. కాగా, జూన్ 20న ఫ్యాబిఫ్యూ డ్రగ్ తయారీ, విక్రయానికి సంబంధించి ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ నుంచి గ్లెన్‌మార్క్ ఫార్మా కంపెనీకి అనుమతులు లభించాయని తెలిపింది. భారత్‌లో కేంద్రం నుంచి తమ కంపెనీకే మొదటిసారిగా అనుమతులు లభించాయని హర్షం వ్యక్తంచేసింది. ఇదిలావుండగా గ్లెన్‌మార్క్ ఫార్మా ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లను ఫ్యాబిఫ్లూ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.