భారతీయ యువతిని పెళ్లాడబోతున్న ఆసిస్ ఆల్‌రౌండర్ - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ యువతిని పెళ్లాడబోతున్న ఆసిస్ ఆల్‌రౌండర్

February 26, 2020

Glenn Maxwell

ప్రేమ జంటలు సరిహద్దులు, కులమత భేదాలు చెరిపేస్తున్నాయి. సినీ పరిశ్రమతోపాటు, క్రికెట్ రంగంలోనూ ప్రేమపెళ్లిళ్లు బ్యాండ్ బాజా మోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ భారత సంతతి యువతిని పెళ్లాడబోతున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఫార్మాసిస్ట్ వినీ రామన్‌తో అతనికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. అంతేకాకుండా ఆమెతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. వినీ, మాక్స్‌వెల్‌లు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే అధికారికంగా ఆ విషయాన్ని చెప్పలేదు. దీంతో ఈ బంధం ఎన్నాళ్లుంటుందిలే అని మీడియా అనుమానం వ్యక్తం చేసింది. ఇంటివాడు కాబోతున్న మాక్స్‌వెల్‌ను ఆసిస్‌తోపాటు పలు దేశాల క్రికెటర్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.