పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు..జట్టు మొత్తం స్టార్స్‌తో నిండి ఉన్న ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ ట్రోఫి గెలవని జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. బౌలింగ్ వైఫల్యానికి తోడు దురదృష్టం తోడవ్వడం..ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ దక్కించుకోలేకపోయింది. ప్రతీ సారి ‘ఈ సాల కప్ నమదే’ అంటూ బరిలోకి దిగడం..కప్ రేసు నుంచి తప్పుకోవడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది. కోహ్లీ అభిమానులతో పాటు బెంగళూరు ఫ్యాన్స్ కప్పు కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఐపీఎల్లో నైనా ట్రోఫి ఆందుకోవాలని ఆశ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు ఓ షాకింగ్ వార్త కలవరపెడుతోంది.
ఆర్సీబీ స్టార్ ప్లేయర్, ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్ వచ్చే ఐపీఎల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం గాయాంతో బాధపడుతున్న మ్యాక్సీ వచ్చే ఐపీఎల్ నాటికి కోలకోవడం కష్టమే అని తెలుస్తోంది. తాజాగా అతనే తన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించాడు. ఈ ప్రమాదంలో తన పాదాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నాడు. ఆరంభంలో నడవడం కూడా చాలా కష్టంగా ఉండేదని చెప్పాడు. నెమ్మదిగా గాయం నుంచి కోలుకుంటున్నానని చెప్పాడు. అయితే ఐపీఎల్ నాటికి గాయం నుంచి కోలుకుంటున్నానని మ్యాక్స్ వెల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ప్రతీ నిమిషం గాయం తగ్గించేందుకు ఉయోగిస్తున్నానని తెలిపాడు. తన బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చే మ్యాక్స్‌వెల్ దూరమైతే ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లిన మ్యాక్స్‌వెల్ అక్కడ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ఘటనలో అతని కాలికి తీవ్ర గాయమైంది. దీని కారణంగా ఆస్ట్రేలియా జట్టుతో పాటు, బిగ్‌బాష్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే వైద్యులు గాయం రికవరీ కావడానికి 3-4 నెలలు పడుతుందని సూచించారు.
ఇవి కూడా చదవండి :
2022లో టీం ఇండియా క్రికెట్ రౌండప్..
వార్నర్ అరుదైన రికార్డు..100వ టెస్ట్‌లో డబుల్ సెంచరీ..