ప్రధాని మోదీకి మరో అవార్డు.. బిల్ గేట్స్ చేతుల మీదుగా.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీకి మరో అవార్డు.. బిల్ గేట్స్ చేతుల మీదుగా..

September 25, 2019

ప్రధాని మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా ‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. 

బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ అవార్డు పేదరికాన్ని అంతం చేయడానికి కృషిచేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు అందిస్తారు. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్ములించడానికి కృషి చేస్తున్న నాయకులను ఒకేచోట చేర్చడానికి ప్రయత్నిస్తోందని బిల్ గేట్స్ అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ సహా పలువురు హాజరయ్యారు.