వచ్చే 48 గంటల్లో ఇంటర్నెట్ సేవలు బంద్.. - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే 48 గంటల్లో ఇంటర్నెట్ సేవలు బంద్..

October 12, 2018

రాబోయే 48 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రధాన సర్వర్‌ నిర్వహణ పనుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగనుందని ‘రష్యాటుడే’ పేర్కొంది. ఐసీఏఎన్ఎన్ (ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) ఆధ్వర్యంలో ప్రధాన సర్వర్ ఉండగా.. సైబర్ దాడుల నుంచి ఇంటర్నెట్‌ను మరింత సురక్షితం చేసేందుకు క్రిప్టోగ్రాఫిక్స్ కీని మార్చాల్సి ఉందని, అందుకే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంది.

Internet users can expect to face difficulties in accessing web pages or making any transactions in the next 48 hours.

ఈ మరమ్మతుల కారణంగా నెట్‌వర్క్ షట్‌డౌన్ అవుతుందని, ఆ సమయంలో వెబ్ పేజీల యాక్సెస్, బ్యాంకు లావాదేవీలకు ఇబ్బందులు తలెత్తవచ్చని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ కూడా ప్రకటించింది. అవుట్‌డేటెడ్‌ ఐఎస్‌పీ(ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌) వాడకందారులు ఈ అసౌకర్యాన్ని చవి చూస్తారని వెల్లడించింది.