ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమామేశంలో మాట్లాడిన నారాయణ ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఘాటుగా స్పందించారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు అంతా ఓ నాటకమని ఆయన ఆరోపించారు. పెట్టుబడుల లెక్కలన్నీ కాకి లెక్కలని, వాస్తవ లెక్కలు కావాలన్నారు. జగన్ను పారిశ్రామికవేత్తలు విశ్వసించే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్‍కు, మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిని ద్రోహులుగా చూస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.