విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం..ముఖేష్ అంబానీతో సహా పలువురు ప్రముఖులు హాజరు..!! - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం..ముఖేష్ అంబానీతో సహా పలువురు ప్రముఖులు హాజరు..!!

March 3, 2023

ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖలో నేడు ప్రారంభం అయ్యింది. మా తెలుగు తల్లికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించి..జ్యోతి ప్రజ్వలనతో సమ్మిట్ ను ప్రారంభిచారు. 26 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. పలు దేశాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. 26 దేశాల నుంచి పదివేల మంది ప్రతినిధులు పాల్గొంటుండగా ఇండియా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న అంబానీకి రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి రజనీ, ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు.

కాగా ఈ సమ్మిట్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో పాల్గొన్న పారిశ్రామికవేత్తల్లో 21మంది ప్రసంగిస్తారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కీలక ఉపన్యాసం చేయనున్నారు. సుమారు రెండు లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ నిన్న సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు.