నేల, నీరు, కొండలు, మంచు అన్నీ కలిస్తేనే భూమి. అన్నీ సక్రమంగా ఉంటేనే మన భూమి సవ్యంగా ఉంటుంది. ఏ ఒక్కటి గతి తప్పినా అల్లకల్లోలం అయిపోతుంది. అయితే ఇది జరగక తప్పేలా అనిపించడం లేదు. చాల రోజుల నుంచి భయపెడుతున్న గ్లోబల్ వార్మింగ్ మరింత భూమిని నాశనం చేసేస్తోంది. తాజా అధ్యయనాలు ఈ వాస్తవాన్నే వెలుగులోకి తెస్తున్నాయి.
హిమానీ నదాలపై అధ్యయనాలు జరగుతూనే ఉన్నాయి. అయితే వీటిల్లో తేలింది ఏంటంటే….ఈ శతాబ్దం అంతం అయ్యే సమయానికి ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు అంటే ఏకంగా 80 శాతం కరిగిపోతాయని. గ్లోబల్ వార్మింగ్ అరికట్టడానికి ప్రపంచ దేశాలు చాలానే ప్రయత్నాలు చేశాయి. అవి సక్సెస్ అయినా కూడా ప్రమాదం మాత్రం తప్పడం లేదు. 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హంరించుకుపోతుందని అంచనా.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరో రెండు డిగ్రీలు అయితే పర్వాలేదు కానీ మూడు లేదు అంతకన్నా ఎక్కువ పెరిగితే మాత్రం మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాలోలని చిన్న చిన్న హిమానీ నదాలు మొత్తం మాయం అయిపోతాయి. ఇప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయిందని ఇక మీదట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్శిటీ సివిల్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్.