Gmail services are available offline: Google
mictv telugu

ఇక నుంచి ఆఫ్‌లైన్‌లోనూ జీమెయిల్ సేవలు.. ఎలా వాడాలంటే..

June 27, 2022

ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్ తన జీమెయిల్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలో ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లోనూ జీమెయిల్ సేవలు వినియోగించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. మెయిల్ సర్వీసులో జీమెయిల్ వాటా 18 శాతం కాగా, ఇప్పుడు 75 శాతానికి పైగా వినియోగదారుల స్మార్ట్ ఫోన్లలో జీమెయిల్ సౌకర్యం ఉంది. ఈ క్రమంలో నెట్ లేని, గ్రామీణ ప్రాంతాలలో ఉండే వినియోగదారుల కోసం తాజా సౌకర్యాన్ని తెస్తున్నట్టు పేర్కొంది. సంస్థ చెప్పిన ప్రకారం జీమెయిల్‌ను ఆఫ్‌లైన్‌లో ఇలా వినియోగించవచ్చు. ముందుగా జీమెయిల్ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ట్యాప్ చేసి కాగ్ వీల్ బటన్ క్లిక్ చేస్తే సీ ఆల్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ఉంటే అక్కడ ఆఫ్‌లైన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి చెక్ బాక్స్ ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్‌పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్త సెట్టింగులను చూపుతుంది. ఆ సెట్టింగ్స్‌ని ఎనేబుల్ చేస్తే జీమెయిల్ సేవలను ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు.