మోదీకి కరోనా ఉంది.. మర్కజ్‌కు వెళ్లొచ్చిన ముల్లా వితండవాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి కరోనా ఉంది.. మర్కజ్‌కు వెళ్లొచ్చిన ముల్లా వితండవాదం..

April 1, 2020

Go and check Modi first..TN man Tablighi Jamaat refuses to get tested for COVID-19

కరోనా వైరస్‌పై ప్రభుత్వాలు కల్పిస్తున్న అవగాహన ఎందుకూ కొరగాకుండా పోతోంది. కొందరు నిర్లక్ష్యంతో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కొందరు అడ్డగోలు వాదనలు కూడా లేవదీస్తున్నారు. కరోనా కేసులు వేగంగా పెరగడానికి దారితీసిన ఢిల్లీ మర్కజ్ ప్రార్థనకు వెళ్లొచ్చిన మతగురువు(ముల్లా) చేస్తున్న వాదన వింటే కరోనాకే కళ్లు తిరగడం ఖాయం. 

మర్కజ్‌కు వెళ్లొచ్చిన చాలామందికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వాలు వారిని గుర్తించి పరీక్షలు చేయిస్తున్నాయి. అయితే తమిళనాడుకు చెందిన ఈ ముల్లా మాత్రం.. ‘నేను చచ్చినా టెస్ట్ చేయించుకోను. దేశాలు పట్టుకుని తిరిగే మోదీకి ముందు ఆ పరీక్ష చేయండి. మోదీ వంద దేశాలు తిరుగుతాడు కదా. ఆయనకు కరోనా ఉంది. యడప్పాటి పళనిసామికి (సీఎం) కూడా ఉంది. వాళ్లను వదిలేసి పొద్దుట్నుంచి నన్నెందుకు టెస్ట్ టెస్ట్ అంటూ సతాయిస్తారు?’ అని ముల్లా కసురుకుంటున్నాడు. ఈ వీడియోను చూసిన జనం నవ్వాలో ఏడవాలో అర్థం కాకుండా ఉంది భయ్యా అంటున్నారు.