Go First company is offering flight tickets for 1500 only
mictv telugu

ఇండిపెండెంట్స్ డే స్పెషల్.. కేవలం 1500లకే విమాన టిక్కెట్

August 10, 2022

విమాన సంస్థలు సాధారణంగా పండుగల సీజన్‌లో తక్కువ ధరకు విమాన టిక్కెట్లంటూ ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ విమానయాన సంస్థ ‘గో ఫస్ట్’ తక్కువ ధరకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. అందులో భాగంగా కేవలం రూ. 1508లకే విమాన టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ తన అధికారిక వెబ్ సైటులో పేర్కొంది. టిక్కెట్ బుక్ చేయాలనుకునే వారు ఆగస్టు 10 నుంచి 13 వరకు బుక్ చేసుకోవాలి. ప్రయాణ సమయం మాత్రం సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది. గో ఫస్ట్ ఇండిపెండెంట్స్ డే సేల్‌లో భాగంగా కంపెనీ ఈ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. సో తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇంతకు మించిన ఆఫర్ ఏముంటుంది.