అమెరికా పోయి జాబ్ చేస్కో : బీజేపీ ఎంపీ చురక - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా పోయి జాబ్ చేస్కో : బీజేపీ ఎంపీ చురక

April 4, 2022

 6

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం వర్సెస్ రాష్ట్రం, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఆయనపై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసులను అందజేశారు. ఉప్పుడు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయట్లేదని మంత్రి చెప్తున్నారనీ, కానీ, కేంద్ర వెబ్‌సైట్లలో మాత్రం లక్షల టన్నులను ఎగుమతి చేసినట్టు చూపించారని ఆరోపించారు. అంతేకాక, తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కిసాన్ బచావో, వి వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కేంద్రాన్ని విమర్శించిన మంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు ముడి బియ్యం, రీసైక్లింగ్ వ్యాపారం ఉందని, దానికోసం కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద వడ్లను కొనుగోలు చేయడానికి వెయ్యి కోట్లు లేవా? అని ప్రశ్నించారు. సిల్లీ ఫెలో వంటి కేటీఆర్ వల్ల తెలంగాణకు అప్పులే మిగిలాయని విమర్శించారు. పాలన చేతకాకపోతే మునుపటిలా అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసుకోవాలని చురకంటించారు.