పైన పటాస్...లోన లొటాస్..! - MicTv.in - Telugu News
mictv telugu

పైన పటాస్…లోన లొటాస్..!

July 3, 2017

అది పబ్లిక్ ప్లేస్ కాదు..పార్టీ ఆఫీసు అంతకన్నా కాదు. ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్ పోర్ట్.వందలాది మంది వచ్చిపోయే విమాశ్రయం. అయినా బీజేపీ నేతలకు ఇవేవి కనిపించలేదు. రూల్స్ ను తుంగలో తొక్కారు. ఎయిర్ పోర్ట్ ను పార్టీ మీటింగ్ అడ్డాగా మార్చేశారు. అమిత్ షా బీజేపీ చీఫ్ అయితే కావొచ్చు…ఎయిర్ పోర్ట్ లో రెడ్ కార్పెట్ వేయాలా..?ప్రయాణికులకు ఇబ్బందులు కల్గిస్తూ స్టేజ్ , సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ఏంటీ..?కేంద్రం , రాష్ట్రంలో ఎంత అధికారంలో ఉన్నా ఇలా చేయాలా..? అధికారం మత్తులో సుపరిపాలన అంటే ఇదేనా..?

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం గోవా వెళ్లారు. గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు ఆపార్టీ నేతలు డబోలిమ్ విమానాశ్రయం క్లాంప్లెక్స్‌లో హై సెక్యూరిటీ మధ్య పబ్లిక్ మీటింగ్ పెట్టారు. విమానాశ్రయం టెర్మినల్ ఎంట్రన్స్ దగ్గర కార్పెట్‌ హంగులతో పోడియం, ప్రముఖుల కోసం డజనుకు పైగా కుర్చీలు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.చట్టవిరుద్దని తెలిసినా ఎయిర్ పోర్టు ఆవరణలో పెట్టిన పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొన్నారు. రూల్స్ గిల్స్ ను పక్కన పెట్టి జీఎస్టీపై లెక్చర్లు దంచారు.

కార్యకర్తలకు అంటే సోయి లేదు.. మరి అమిత్ షాకు ఏమైంది..? ఎయిర్ పోర్ట్ పార్టీ ఆఫీస్ కాదని తెలియదా..?పైకి నీతులు చెప్పి కమలనాథులు చేసే ఈ పనులేంటో..?అచ్చేదిన్ అచ్చేదిన్ అంటే అచ్చంగా విమానాశ్రయాల్ని పార్టీ అడ్డాలుగా మార్చేయడమా..? గతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ,,ఇప్పుడు గోవా సీఎం మనోహర్ పారికర్ కైనా సోయి లేదా..ఏదో అధినేత దృష్టి లో పడాలని లోకల్ లీడర్స్ అత్యుత్సాహం ప్రదర్శించారే అనుకుందాం..ఇది పద్దతి కాదని చెప్పాల్సిన వీళ్లకు ఏమైంది. ఎలాగూ అధికారం మాదే అనే పొగరా..?

గోవా ఎయిర్ పోర్ట్ లో బీజేపీ మీటింగ్ పై కాంగ్రెస్ సీరియస్ అయింది. బీజేపీ అధికార దుర్వినియోగంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.విమానాశ్రయాలను పార్టీ కార్యక్రమాల కోసం అడ్డాగా మార్చుకోవడం సరికాదని ఏఐసీసీ కార్యదర్శి గిరీష్ ఛోడంకర్ అన్నారు. విమానాశ్రయంలో చట్టవిరుద్ధంగా సమావేశం జరిపిన అమిత్‌షా, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సభకు అనుమతించిన విమానాశ్రయ అధికారులపై ఫెనాల్టీ వేయాలని కోరారు. చూడాలి అమిత్ షా దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో.