తెలంగాణ కంటే మా దగ్గరే ఎక్కువ పథకాలు : గోవా సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కంటే మా దగ్గరే ఎక్కువ పథకాలు : గోవా సీఎం

May 12, 2022

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోందనీ, ప్రజల స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం కలుగుతోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఆవశ్యకత గురించి చెప్పారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉంటే చివరి వ్యక్తి వరకూ సంక్షేమ పథకాలు అందుతాయి. గోవాలో తెలంగాణ కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నాం. పర్యాటకులతో సహా వంద శాతం వ్యాక్సిన్ వేసిన రాష్ట్రం మాది. పంచాయితీ స్థాయిలో గెజిటెడ్ అధికారులు పర్యటించి పథకాలు అమలయ్యేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎలా ఉంటుందో మా దగ్గర వచ్చి చూడండి. గోవా ఎన్నికల్లో కిషన్ రెడ్డి చాలా బాగా పనిచేశార’ని వెల్లడించారు.