కరోనా నింపిన విషాదం.. మాజీ ఆరోగ్య మంత్రి మరణం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా నింపిన విషాదం.. మాజీ ఆరోగ్య మంత్రి మరణం

July 7, 2020

cncn

మాజీ ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన సురేష్ అమోన్‌కర్ (68) కరోనా కాటుకు బలయ్యారు. ఈ సంఘటన గోవాలో విషాదాన్ని నింపింది. తక్కువగానే కేసులు నమోదు అవుతున్నా ఓ ప్రజా ప్రతినిధి కరోనాతో చనిపోవడంతో సంచలనంగా మారింది. చాలా రోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరి పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం మరణించారు. దీంతో ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

సురేష్ అమోన్‌కర్ 1999 – 2002 సమయంలో ఫ్రాన్సిస్ కో ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. పాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007  ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై, 2012 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత గోవా సురక్షామంచ్‌లో చేరారు. చాలా కాలంగా ఆయన రాజకీయంగా కూడా యాక్టివ్‌గా ఉండటం లేదు. రాజకీయాల్లో సురేష్ అమోన్‌కర్ చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. కాగా ఇప్పటి వరకు అక్కడ 1761 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 936 మంది కోలుకున్నారు.