గోవా టూరిస్టులకు గుడ్ న్యూస్.. పర్యటనకు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

గోవా టూరిస్టులకు గుడ్ న్యూస్.. పర్యటనకు గ్రీన్ సిగ్నల్

July 2, 2020

Goa Open To Domestic Tourists

వీకెండ్ వచ్చినా, ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా, సరదాగా ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్లాలన్నా ముందుగా చాలా మంది గోవా గుర్తుకు వస్తుంది. అక్కడ ఉండే బీచ్ అందాలు, ఇతర సదుపాయల కారణంగా ఎక్కవగా అక్కడ గడపడానికి ఇష్టపడుతారు. కానీ కరోనా వీటన్నింటికీ చెక్ పెట్టింది. దాదాపు దేశంలో 100 రోజుల పాటు లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో పర్యాటకుల రాక నిలిచిపోయింది. కరోనా కట్టడిలో భాగంగా అక్కడి ప్రభుత్వం కూడా బయటివారిని ఎవరిని రానివ్వలేదు. ఇప్పుడు అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు ఏమి రాకపోవడంతో ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో పర్యాటకులకు అనుమతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

జూన్ 2 నుంచి భారత పర్యాటకులు మాత్రం రావొచ్చని సూచించింది. నిబంధనలు పాటిస్తూ బీచ్‌లలో సరదాగా గడపొచ్చని పేర్కొంది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా విధించారు. ఎవరైనా తమ రాష్ట్రానికి వచ్చే ముందు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని అధికారులు సూచించారు. టెస్టులు చేయించుకోకుండా వచ్చినా.. తమ సరిహద్దుల్లో పరీక్షించి ఆ తర్వాతే లోపలికి పంపుతామని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే మాత్రం తమ ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపిస్తామని తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస చేసేందుకు ప్రత్యేకంగా 250 హోటళ్లను సిద్ధం చేసింది. వీటికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా వాటిని నిర్వహించాలని సూచించింది. పక్కా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.