టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునకు గోవాకు చెందిన ఓ సర్పంచ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలను ఆపకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ అమిత్ సావంత్ ఈ నోటీసులు జారీ చేయగా, ఇది కాస్త చర్చనీయాంశమైంది. గ్రామంలో నాగార్జునకు సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం లేనందున సర్పంచ్ నోటీసులు జారీ చేశారు. ‘ముందస్తు అనుమతి లేకుండా సర్వే నం. 211/2బి ప్రాంతంలో మీ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయితీ రాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టంగా పేర్కొన్నారు.