రూ. 312కే విమాన ప్రయాణం.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 312కే విమాన ప్రయాణం..

November 24, 2017

విమానయాన సంస్థల మధ్య గొంతుకోత పోటీ ప్రయాణికులకు మేలు చేస్తోంది. ఇండిగో వంటి సంస్థలు ఇప్పటికే తక్కువ ధరలతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ దిమ్మతిరిగే  భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.ఎంపిక చేసిన మార్గాల్లో పరిమిత కాల ఆఫర్ కింద కేవలం  రూ.312కే టిక్కెట్లను అమ్ముతోంది. ఈ ధరలకు పన్నులు కలపాల్సి ఉంటుంది.ఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, లక్నో మార్గాలకు ఈ ప్రత్యేక ధరలు వర్తిస్తాయి. సహా 7 నగరాలకు వన్‌-వే జర్నీకి ఈ టిక్కెట్‌ అందిస్తున్నారు. శుక్రవారం నుంచి బుకింగ్ మొదలైంది. మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు విధానం కింద టికెట్లు అమ్ముతారు. కొన్నవారు డిసెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్‌ 28 మధ్య ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బుకింగ్ 29 వరకు ఉంటుంది.