పాపం మేకకు ఎంత ఆకలయ్యింది ఏమో…ఆకులేమో అందనంత దూరంలో ఉన్నాయి..అందుకే ఈ ఫీట్, చెట్టుకిందున్న హీరో హోండా బండియే మేక మేతకు సాయం అయ్యింది,వెంటనే దానిమీద ఎక్కి..సైడ్ అద్దంపై రొండు కాళ్లు పెట్టి తన ఆకలి తీర్చుకుంది.అటు వెళ్తున్న వాళ్లెవరో ఈ దృష్యాన్ని కెమెరాతో క్లిక్ మనిపించారు.కామారెడ్డి జిల్లా బీబీపేట్ అనే గ్రామంలో గ్రామపంచాయితీ దగ్గర జరిగిన సంఘటన ఇది.ఆకలి రుచి ఎరుగదని అంటారు…కానీ ఈ ఫొటోలోని మేకను చూస్తుంటే..ఆకలి ఫీట్ కూడా ఎరుగదని తెలుస్తుంది.