మేకే రాజు.. రాజాభోగాలే వేరు... - MicTv.in - Telugu News
mictv telugu

మేకే రాజు.. రాజాభోగాలే వేరు…

August 11, 2017

మేకను తినడానికి, పాలకు, తోలు తప్పితే దేనికి పనికిరాదు అనుకుంటాం. కానీ ఐర్లాండ్ లో మేకను రాజుగా కొలుస్తారట. మేక రాజుగా ఉన్నంతకాలం, అక్కడ మేక మహాప్రభు గారు. తను ఏం చెప్పితే అదే శాసనం . మేక ఏంది – రాజు ఏంటి అనుకుంటున్నారా ? అయితే గీ స్టోరీ మీకోసమే…

ఐర్లాండ్ లోని కిల్లోర్ గ్లిన్ అనే ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎంతో సాంప్రదాయంగా ప్రతి ఏటా ఓ పండుగను జరుపుకుంటారట. ఆ పండుగ జరుపుకునే సమయంలోనే అక్కడ పెరిగిన ఓ మేకను రాజుగా ప్రకటించాక, ఓ స్కూల్ అమ్మాయి చేత దానికి కిరీటం పెట్టిస్తారట. ఈ వింత ఫెస్టివల్ ను చూడటానికి చాలా ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారట. మేక రాజుగా ఉన్నన్ని రోజులు విందు వినోదాలు, రాజాభోగాలను అనుభవిస్తుందట. దానికి రాజు కిరీటం పెట్టడానికి ముందు ఆ ప్రాంతం మెుత్తం దాన్ని తిప్పుతారట. పండుగ సమయంలో గుర్రపు పందేలు, స్ట్రీట్ పర్ ఫార్మెన్స్ , మ్యూజిక్ , ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేస్తారట అక్కడి ప్రజలు. ఈ ఫెస్టివల్ ను 17 వ శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారట.